ప్రపంచ ధనవంతుడు చెప్పిన ఏడు వ్యాపార సూత్రాలు
బ్రతికె ప్రతి మనిషి సొంతంగా వ్యాపారం చేసి డబ్బు సంపాదించాలని.., హుందాగా బ్రతకాలని...,, జీవితంలో తన లక్ష్యాన్ని,, గెలవాలని.., తాను ఏంటో ఈ ప్రపంచానికి తెలిసేలా చేయాలనీ కోరుకుంటాడు... ఆ ఆశని ఇంకా ఆ లక్ష్యాన్ని సాధించాలంటే అందుకు కావాల్సిన Skills అంటే నైపుణ్యలు..,, knowledge అంటే జ్ఞానం మరి ముఖ్యంగా తన మీద తనకి నమ్మకం ఉండాలి... దానినే ఆత్మవిశ్వాసం అంటారు... ఆలా తన ఆత్మవిశ్వాసంతో ఆటు వ్యాపారం లోను ఇటు జీవితంలోను గెలిచినా వ్యక్తి గురించి నేను మీకు చెప్పబోతున్నాను... అతను ఎవరో కాదు.., ప్రపంచా ధనవంతులలో No.1 Mr జెఫ్ బెజోస్...
1999 ముందు వరకు No.1 ధనవంతుడు ఎవరు అంటే అందరూ "బిల్ గేట్స్" పేరు చెప్పేవారు కానీ.., 1999 లో బిల్ గేట్స్ ని దాటి 100 బిలియాన్ అంటే సుమారు 100 కోట్లకి పైగా ఆస్తితో ప్రపంచ ధనవంతులలో No.1 గా మారారు... మరి ఆ స్థాయి కి జెఫ్ బెజోస్ ఎలా చేరుకున్నారు.., తన జీవిత ప్రయాణంలో అతను నేర్చుకున్న పాఠాలు ఏంటి..? జెఫ్ తన విజయాన్ని ఎలా సాధించాడు..? ఇవన్నీ ఈ ఆర్టికల్లో తెలుసుకోబోతున్నారు... సిద్ధంగా ఉండండి...
1.. కొత్తగా మరియు ఆలోచనత్మకథకంగా
దీని అర్ధం.., అందరిలా ఒకే రకంగా కాకుండా సరికొత్తగా అలోచించి ఆవిష్కరణలు మొదలుపేటి పూర్తి చేసి చూపించాలి...
జెఫ్ బెజోస్... చిన్నప్పటి నుండే ఏ విషయానైనా కొత్తగా ఆలోచించేవాడు... అతని తల్లిదండ్రులు కూడా జెఫ్ ని అందరి పిల్లల కాకుండా స్పెషల్ పిలవాడిలా పెంచేవారు... అందువలే జెఫ్ ఏ విషయానైనా సరికొత్త ద్రుష్టితో చూసేవాడు... కొత్తగా ఆలోచించేవాడు...
ఉదాహరణకి..., తన చిన్నపుడు నడక నేర్చుకునే సమయంలో తన ఇంటి దగ్గర ఉన్న పశువుల తొట్టిని చూసి ఆశ్చర్యపోయాడు.., అది ఎలా తయారు చేస్తారో తెలుసుకోవడానికి ఏకంగా ఆ తొట్టిని Screw డ్రైవర్ తో తెరిచి చూసాడు...
ఇప్పటి వరకు జీవితంలో విజయం సాధించిన వాళ్ళందారిలో ఈ ఆలోచన తప్పక ఉంటుంది అదే "నూతనంగా ఆలోచించడం"... ఈ పాయింట్ జీవితంలో విజయం సాధించిన పర్సన్స్ అందరిలో ఉంటుంది... కాబ్బటి మిత్రులారా కొత్తదనంతో ఆలోచించండి... మీ మేధస్సు ని పెంచుకోండి... ఏ విషయానైనా కొత్త కోణంలో ఆలోచించండి... జీవితంలో మీరు అనుకున్నది సాధిస్తారు...
2... తన గురించి తను ఆలోచించడం
జెఫ్ తన చిన్నప్పటి నుండే తనలో ఉన్న బలం.., మరియు బలహీనతల గురించి తెలుసుకోనేవాడు.. ఆలా తనని తను మార్చుకుంటు కొత్త విషయాలు నేర్చుకునేవాడు... ఆలా తన గ్రాడ్యుయేషన్ పూర్తిచేసాడు.. ఆ తరువాత ఫిజిక్స్ చదవడం కోసం ప్రిన్స్ టోన్ యూనివర్సిటీలో చేరాడు... కానీ తరువాత జెఫ్ తనకి ఫిజిక్స్ మీద ఇష్టం లేదని తెలుసుకొని తనకి ఇంటరెస్ట్ ఉన్న కంప్యూటర్ మీద "" కంప్యూటర్ సైన్స్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ "" లో బ్యాచ్ లార్ డిగ్రీని కంప్లీట్ చేసాడు.. ఆలా తనకి ఇంటరెస్ట్ ఉన్న కంప్యూటర్ ద్వారా కెరీర్ లో కూడా సక్సెస్ అయ్యాడు...
ఈ పాయింట్ నుంచి...,,, మీ గురించి మీరే తెలుసుకోవాలి... ఆలా మీ గురించి మీరు తెలుసుకోవడం ద్వారా మీలో ఉన్న బలం మరియు బలహీనత మీకు తెలుస్తాయి... ఆలా మీమల్ని మీరు మార్చుకోవచ్చు... ఆలా మీలో ఉన్న మైనస్ పాయింట్స్ ని తాగించుకుంటూ.., ప్లస్ పాయింట్స్ ని పెంచుకుంటూ మీరు మీ కెరీర్ లో మీ కెరీర్ లో సక్సెస్ అవచ్చు...
జెఫ్ బెజోష్ ఫిజిక్స్ చదవడం కోసం ప్రిన్స్ టోన్ యూనివర్సిటీలో చేరాడు... కానీ ఫిజిక్స్ మీద తనకు ఇంటరెస్ట్ లేదని త్వరగా తెలుసుకొని తనకి ఇష్టం అయినా కంప్యూటర్ సైన్స్ లో జాయిన్ అయ్యాడు... ఆలాగే మనం కూడా నాలుగు ఏమి చేస్తే అదే చేయకుండా మనకి దేని మీద ఇంటరెస్ట్ ఉంటుందో ఆ సబ్జెక్టు మీద కెరీర్ లో ముందుకు వేళ్లాలి...
3.. భవిష్యతులో జరిగే ఫలితాలని ముందే ఊహించడం వాటి కొరకు జాగ్రత్తగా ప్లాన్ చేయడం
జెఫ్ బెజోష్ తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత జెఫ్ కి చాలా కంపెనీల నుండి ఆఫర్ లెటర్స్ వచ్చాయి..
కానీ జెఫ్ అందులో తనకి ఇష్టం ఉన్న కంప్యూటర్ ఫీల్డ్ లోని జాబ్ ని మాత్రమే ఏనుకున్నాడు.. అందులోనే జాయిన్ అయ్యాడు. జెఫ్ బెజోష్ తనకు ఇంటర్నెట్ మరియు కంప్యూటర్ మీద ఆసక్తి ఉన్నందున., జెఫ్ ఫీటేల్ ఫైబరేస్టిక్ అనే కంపెనీలో జాయిన్ అయ్యాడు.. అక్కడ అతను ఇంటర్నెట్ ని ఫైనాన్సియల్ డెవలప్ చేయడం కోసం కంప్యూటర్ నెట్.వర్క్ ను కనిపెట్టాడు.. ఆలా అతను కనిపెట్టిన కొని రోజులోనే " డీ షా " అనే పెద్ద కంపెనీలో కంప్యూటర్ స్పెషలిస్ట్ గా కూడా వర్క్ చేసారు... అక్కడ జెఫ్ ఎంతో క్రమశిక్షణతో పనిచేసేవారు... ఆల అతను అతి తక్కువ టైంలోనే అదే కంపెనీలో వైస్ ప్రెసిడెంట్ గా కూడా పనిచేసారు. కానీ అనుకోకుండా ఒకరోజు ఇంటర్నెట్ లోని ఒక ఆసక్తికరమైన విషయాన్ని అతను చదివాడు.. అది ఏంటంటే ప్రతి సంవత్సరం 23% శాతంగా ఇంటర్నెట్ వినియోగం పెరుగుతుంది... ఈ పాయింట్ జెఫ్ ని ఆలోచనలో పడేసింది..
ఈ విషయం చదివాక ఇంటర్నెట్ అవసరం., ప్రజలు ఇంటర్నెట్ ని ఎంతలా ఉపయోగిస్తున్నారో అర్ధం అయింది.. ఈ పాయింట్ జెఫ్ కి ఒక టర్నింగ్ పాయింట్ ల అనిపించింది.. ఒక నిర్ణయం తీసుకున్నాడు.. అది ఇంటర్నెట్ లో బుక్స్ అమ్మడం ప్రారంభించలని.. ఈ విషయాన్ని తన ఫ్రెండ్స్ కి చేపినప్పుడు నువ్వు రిస్క్ తీసుకుంటున్నవ్ అని ఎగతాళి చేసారు.. కానీ జెఫ్ అవేమి ఆలోచించకుండా తన ఆలోచనలని ప్రారంభించాడు.. ఇందుకు కారణం తన నిర్ణయం మీద ఉన్న నమ్మకం..
ఈ పాయింట్ నుంచి నేర్చుకోవలసిన విషయం ఒకటే.., ఎవరైతే జీవితంలో విజయం సాదించాలి అని కోరుకుంటారో వాలందరు భవిష్యత్ లో జరిగే మార్పుల గురించి అవగాహనా పెంచుకోవాలి.., భవిష్యత్ లో జరిగే విషయాలను ముందే తెలుసుకుని అందుకు గాను పర్ఫెక్ట్ ప్లాన్ తో సిద్ధంగా ఉండాలి...
హాయ్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు చదివిన మూడు పాయింట్స్ మీకు నచ్చిందని ఆశిస్తూన్నాను.., ఇంకో నాలుగు పాయింట్స్ గురించి తరువాతి ఆర్టికల్ లో చెపుతాను మరి ఆ ఆర్టికల్ ని మిస్ కాకూడదు అని కోరుకుంటే ఈరోజే నను ఫాలో అవండి... ఆలాగే ఈ 3 విషయాల గురించి మా AJ UNKNOWN FACTS IN TELUGU యూట్యూబ్ ఛానల్ లో ఒక వీడియో చేసాను
ఆసక్తి ఉన్నవారు యూట్యూబ్ లో లాగ్ ఇన్ అయ్యి వీక్షిoచండి
మా యూట్యూబ్ ఛానల్ ని Subscribe చేసి నన్ను సపోర్ట్ చేయండి... ధన్యవాదలు..., సెలవు మిత్రులారా...
0 కామెంట్లు