The Unsolved Mysteries Of 5 Indian Temples In Telugu

 

ఇప్పటికి సమాధానం దొరకని 5 అతి పురాతనమైన భారతీయ దేవాలయాలు

credit: third party image reference

పురాతన కాలం నుంచి మన దేశంలోని ఎన్నో గుళ్ళు పూజలు అందుకుంటూన్నాయి. అందులో కొన్ని ఎన్నో మహిమలు మరికొన్ని ఎన్నో మిస్టరిలు. ప్రస్తుతం మన టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందుతున్న ఆ దేవాలయలలోని మిస్టరిల వెనక దాగివున్న అసలు కారణాని మాత్రం మనం ఇప్పటికి కనిపెట్టిలేకపోతున్నాము.. ఇవాళ్టి ఆర్టికల్లో ఇప్పటికి సమాధానం దొరకని 5 మిస్టరియస్ దేవాలయల గురించి మీకు చెప్పబోతున్నాను.

credit: third party image reference

అయితే., ఈ ఆర్టికల్ కి సంబందించిన వీడియోని మా యూట్యూబ్ ఛానల్ అయినా AJ Unknown Facts In Telugu లో విడుదల చేయడం జరిగింది... 

https://youtu.be/BssTjZsTDSs

ఆసక్తి ఉన్నవారు... ఇంకా వివరంగా తెలుసుకోవాలి అనుకున్నవారు మా ఛానల్ని Subscribe చేసి చుడండి థాంక్యూ మిత్రమా

1.. కామాక్యా దేవాలయం

credit: third party image reference

అస్సాంలోని గౌహతి దగ్గరలో ఉండే ఈ దేవాలయం., 52 శక్తీ పీఠలలో చాలా ముఖ్యమైనదిగా చెబుతారు. అయితే ఈ ఆలయంలో అమ్మవారి విగ్రహం లేకపోవడం గమనించల్సిన విషయం. పురాణల ప్రకారం., ఈ కామాక్యా ఆలయంలో సతిదేవి యొక్క యోని భాగం ఇక్కడ పడిందని అందుకే ఈ ఇక్కడి మాతని యోని మాత అని పిలుస్తారని చెబుతారు. ఇది కాలక్రమేన శక్తీ పీఠలలో మారింది. ఈ ఆలయాన్ని కామాక్యా అని పిలవడానికి కారణం ఇక్కడకు వచ్చే భక్తుల కోరికలు నెరవేరడమే.

కామక్యా ఆలయాన్ని మూడు భాగాలుగా నిర్మించారు. అందులో మొదటి భాగం అతి పెద్ద ద్వారం ఇక్కడికి అందరు వెళ్ళడానికి అనుమతి లేదు. రెండవ భాగంలో అమ్మవారి దర్శనం ఉంటుంది. ఇక ఇక్కడే అమ్మవారి యోని భాగం మనకు దర్శనమిస్తుంది. మూడవ భాగంలో దేవాలయం యొక్క పరిసరాలు ఉంటాయి. ఇక ఈ ఆలయంలోని మిస్టరి విషయానికి వస్తే ఈ ఆలయంలోని అమ్మవారి యోని భాగం నుంచి రక్తం ప్రవహిస్తుంది. అది కూడా నెలలో మూడు రోజులు మాత్రమే. ఇక ఈ మూడు రోజులు ఆలయంలోకి ఎవరు ప్రవేసించకుండా ఆలయాన్ని మూసివేస్తారు. అసలు ఇంతకీ ఇది ఎలా జరుగుతుంది..? ఆ రక్తం ఎలా ప్రవహిస్తుంది అనే ప్రశ్నకి ఇప్పటికి సమాధానం దొరకలేదు. అది ఇప్పటికి ఒక మిస్టరిగా మిగిలిపోయింది.

2..కర్ణిమాత ఆలయం

credit: third party image reference

ఈ ఆలయం రాజస్థాన్ లోని బికనీర్ నుండి 30కిలోమీటర్ల దూరం లో దేస్నొక్ పట్టణం ఉంది. ఈ ఆలయాన్ని మాత కా మందిర్ లేదా ముషీక్ మందిర్ అని కూడా పిలుస్తారు. ఈ ఆలయ దేవత కర్ణిమాత ఇవ్విడనే దుర్గామాతగా కూడా పిలుస్తారు. ఈ అమ్మవారు ఇక్కడ 110 సంవత్సరాలు జీవించినట్టు చెబుతారు. ఇక ఈ ఆలయ మిస్టరి విషయానికి వస్తే ఈ ఆలయంలో ఎలుకలు వెలసంఖ్యలో ఉండడం విశేషం. ఈ ఎలుకలు ఎప్పటి నుండి ఇక్కడ ఉంటున్నాయి.., ఎక్కడి నుండి వస్తున్నాయి. అన్న ప్రశ్నకి ఇంకా సమాధానం దొరకలేదు. ఈ ఆలయంలోని ఎలుకలు వెల సంఖ్యలో ఉన్న అందులో 4 ఎలుకలు మాత్రం తెల్లగా కన్పిస్థాయి. ఈ 4 ఎలుకలు అన్ని వెళ్లలో కాకుండా కేవలం కేవలం ముఖ్యమైన పూజల సమయంలో మాత్రమే కన్పిస్థాయి. ఆ తెల్ల ఎలుకలు కర్ణిమాత కుటుంబ సభ్యులుగా చెబుతారు. ఈ తెల్ల ఎలుకలు ఎవరికీ కనపడతాయో వారి కోరికలు నెరవేరతాయి. అన్నది.., ఇక్కడి భక్తుల నమ్మకం. అయితే ఈ తెల్ల ఎలుకలు ఎక్కడి నుంచి వస్తున్నాయి. తిరిగి ఎక్కడికి వెళ్తున్నాయి అన్నది అది ఇప్పటికి ఒక మిస్టరిగా మిగిలిపోయింది.

3.. జ్వాలా మాత ఆలయం

credit: third party image reference

ఈ ఆలయం హిమాచల్ ప్రదేశ్ లోని కాళీదర్ కొండ మధ్యలో ఉంది. భారతదేశ ప్రసిద్ధ శక్తీ పీఠలలో జ్వాలా మాత ఆలయం ఒకటి.., అలాగే మాత సతిదేవి యొక్క నాలుక భాగం ఈ ప్రదేశంలో పడిందని చెబుతారు. అందుకు చిహ్నంగా ఈ ఆలయం లోని జ్యోతి ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది. అది కూడా ఎలాంటి నున్నే.., ఇతర ఇంధనం లాంటివి సహాయం లేకుండా... అందుకే ఈ ఆలయానికి జ్వాలా మాత ఆలయం అని పేరు. ఈ ఆలయంలో ఈ ఆకండ జ్యోతితో పాటు ఇంకో తొమిది జ్యోతులు వెలుగుతూనే ఉంటాయి. ఈ తొమిది జ్యోతులనే తొమిది దేవతల రూపాలుగా చెబుతారు. ఆవి 1.మహాకాళ్లి 2.. అన్నపూర్ణ 3.. చండి 4.. హింగ్లజ్ 5.. వింధ్యవాసిని 6.. మహాలక్ష్మి 7.. సరస్వతి 8.. అంబికా మరియు 9.. అంజిదేవి

ఈ ఆలయంలోని జ్వాలాలను ఆపేయలని పూర్వం మొహమాద్ సుల్తాన్ వంశస్తులు ప్రయత్నించి విఫలమాయారు. ఈ జ్వాలాలు ఎక్కడి నుండి వస్తున్నాయి. ఈ తొమ్మిది జ్యోతులు.., వివిధ తొమ్మిది రంగులలోకి ఎలా మారుతున్నాయి అన్నది ఇప్పటికి ఒక మిస్టరిగా మిగిలిపోయింది.

4.. కాలభైరవ ఆలయం

credit: third party image reference

కాలభైరవ ఆలయం.ఈ ఆలయం మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని నగరానికి సుమారుగా 8 కిలో మీటర్ల దూరంలో ఉంది. పురాతన కాలం నుండి ఈ ఆలయం లోని కాలభైరవ స్వామికి కేవలం మద్యం నే నైవేద్యంగా సమర్పించడం విశేషం. ఇక ఆలయంలోని మిస్టరి విషయానికి వస్తే..., ఈ ఆలయం లోని కాలభైరవ విగ్రహం నోట్లోకి పోసిన మద్యం కేవలం ఒక గుటకలో మాయమవుతుంది. అయితే అది ఎలా జరుగుతుంది అనే ప్రశ్నకి మాత్రం ఇంకా జవాబు దొరకలేదు.

5.. మెహందీపూర్ బాలాజీ ఆలయం

credit: third party image reference

ఈ ఆలయం రాజస్థాన్ లోని దౌసా జిల్లాలోని మెహందీపూర్ లో ఉంది. బాలాజీ అనగానే అందరికి గుర్తుకు వచ్చేది వెంకటేశ్వర స్వామి కానీ ఇక్కడ ఉండేది వెంకటేశ్వర స్వామి కాదు., ఆంజనేయ స్వామి. అలాగే ఈ గుడి 10 ప్రధాన సిద్ధి పీఠలలో ఒకటిగా చెబుతారు. ఇక ఈ ఆలయ విషయానికి వస్తే దెయ్యాలు.., భూతాలు అవహించిన వ్యక్తులను తిరిగి ఇక్కడ మాములు మనుషులుగా మార్చుతారని.., ఇక్కడికి వచ్చిన భక్తులపై ఆ ఆంజనేయ స్వామి దీవెనలు ఎప్పటికీ ఉంటాయని ఇక్కడి వారు నమ్ముతారు. ఈ విషయం తెలుసుకున్న ఢిల్లీ.,, జెర్మన్ శాస్త్రవేతలు.. 2003లో ఈ ఆలయంలో పరిశోధన చేసి విఫలమాయ్యారు. ఈ ఆలయంలో దెయ్యాలను.., భూతాలను వదిలించె పూజలు కేవలం మంగళ.., శనివారాలో మాత్రమే చేస్తారు. ఆ రెండు రోజులు కులమతలకు అతీతంగా ఎక్కడినుంచో భక్తులు ఇక్కడకు వస్తారు. మతిస్థిమితం లేని వాళ్ళు.., దుష్టశక్తుల వల్ల భాధపడేవాళ్ళు ఇక్కడకు రాగానే ఇక్కడకు రాగానే ఎలా మాములు మనుషులుగా మారుతున్నారు అనేది ఎప్పటికి దొరకని ఒక సమాధానంలా.., ఒక మిస్టరిగా మిగిలిపోయింది.

credit: third party image reference

ఈ ఆర్టికల్ మీ అందరికి నచ్చిందనుకుంటూన్నాను ఈ ఆర్టికల్ మీద మీ అభిప్రాయాని కామెంట్ బాక్స్ లో మాతో షేర్ చేసుకొండి. అలాగే ఈ ఆర్టికల్ మీకు నచ్చితే లైక్ చేయండి.

credit: third party image reference

ఇలాంటి మరిన్ని ఆసక్తి కరమైన ఆర్టికల్స్ కోసం ఈరోజే మమాల్ని ఫాలో అవ్వండి.. Thank You ఫ్రెండ్స్... 

ఇంకో మంచి ఆర్టికల్ తో మీ ముందుకు వస్తాను అంత వరకు సెలవు bye... 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు