భయపడుతూ బతుకుతావ లేదా ధైర్యంగా సమస్యలతో పోరాడతావ...?
భయం... నాకు భయం వేస్తుంది అదే ఎందుకు.....?? అసలు నేను ఎందుకు బయపడుతున్నాను నేను ఏ తప్పు చేశాను..??? నా భయానికి అర్ధం ఉందా..? ఇలా మీరు ఎపుడైనా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకున్నారా...?
భయం.... స్టూడెంట్స్ కి కాలేజీ,,స్కూల్స్ అంటే భయం.
ఉద్యోగస్థులకి బాస్ అంటే భయం... చిన్నపిల్లలకి ఉపాధ్యాయులంటే భయం.. అసలు ఈ భయం ఏంటి ఎందుకు భయం... ఈ భయం ఎంత భయంకరం అంటే ఎంత సంతోషంగా ఉన్నవాడినైనా సారే..,, చిటికెలో ఆ సంతోషం మొత్తం మాయం చేసేస్తోంది...
భూమి మీద మంచివాళ్ళు,,, చెడ్డవాళ్లు,,, మాత్రమే కాక ఇంకో రకం మనుషులు కూడా ఉన్నారు... వాళ్లే అమాయకులు... వీళ్ల భయమే సమాజంలోని నీచుల ఆయుధం వీళ్ళ అమాయకత్వo ఉపయోగించి ఆ నీచులు బతికిపోతున్నారు...
ఇలా భయపడుతూ ఉనంతకాలం.. మీ భయన్ని వాడుకుంటూ ఆ నీచులు బతికిపోతారు... మీలో భయం ఉనంతవరకు మీరు ప్రతిరోజు చస్తూ బతుకుతారు... చస్తూ బతుకుతార...?? ధైర్యంగా సమస్యలకి పోరాడుతారా.. అంత నీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది...
నిన్ను నువ్వు నమ్మి అడుగుముందు వేస్తావో లేదా,,, ఇలాగే భయపడుతూ సిగ్గులేకుండా చస్తూ బతుకుతావో నీ నిర్ణయం మీదే నీ జీవితం ఆధారపడి ఉంటుంది మిత్రమా....
0 కామెంట్‌లు