You are The Arjun And Krishna in Your Life in Telugu

నీ జీవితానికి నువ్వే అర్జునుడివి నువ్వే కృష్ణుడివి


జీవితం ఒక రణరంగం....... ఆందులో ఉండే మనం సైనికులం...... మన కర్తవ్యం మన జీవితం అనే ఈ యుద్ధంలో సమస్యలతో పోరాడి గెలిచి జీవితంలో ఎదగడం ఆందుకు ఎవడు అడ్డువచ్చిన సరే వాడిని తొక్కి మరి ముందుకు సాగడం........

పెంచడం వరకే అమ్మానాన్నల బాధ్యత....... దారి చూపించడం వరకే దేవుడి భాద్యత....... ఆ దారిలో నడవటం గెలవటం ఆంత నువ్వే చేయాలి.. ఏమైనా సరే.


సమస్యలు నీ శత్రువులు... పరిస్థితులు నీకు పద్మావ్యూహం లా మారవచ్చు కానీ వాటిని నువ్వు అభిమన్యుడిల పోరాడాల... లేదా అర్జునుడీల గెలవల అన్నది నీ చేతులోనే ఉంటుంది...


అందరి జీవితంలో కృష్ణుడు ఉండడు.. మన జీవితానికి మనమే కృష్ణుడీల మారాలి.... నీ జీవితానికి నువ్వే అర్జునుడివి... నువ్వే కృష్ణుడివి...ఇక్కడ ఎవరు నీకన్నా ఎక్కువ కాదు ఎవరు నీకన్నా తక్కువ కాదు నువ్వు ఏంటో ఈ ప్రపంచనికి తెలీదు కానీ నీకు తెలుసు కదా


ఓపిక పట్టు అవకాశం రాగానే నీ పంజా దెబ్బ చూపించు బారించే వాడిని చూసి జాలిపడదు ఈ లోకం గుర్తుంచుకో... గుర్తుపెట్టుకో పారిపోయే పిల్లులని చూసి కొట్టడానికి ముందుకు వస్తారు ఆదే వేటాడే సింహం కనపడినప్పుడు భయంతో పారిపోతారు.....


పారిపోయే వాడిని చూసి ఏడిపిస్తుంది వేటాడే మనిషిని చూస్తే సలాం కొడుతుంది.... గుర్తుపెట్టుకో మిత్రమా..... 


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు