20 ఆసక్తికరమైన విషయాలు ఆర్టికల్ - 3
హలో మిత్రమా ఎలా ఉన్నారు...? ఇంతకు ముందు ఆర్టికల్లో 20 ఆసక్తి కరమైన విషయాలను చెప్పాను...
ఇవాళ్టి ఆర్టికల్లో మరో 20 ఆసక్తికరమైన విషయాలను ఈరోజు మీకు చెప్పబోతూన్నాను... మరి మీరు సిద్దంగా ఉన్నారా..?
అయితే ఈ ఆర్టికల్ కి సంబందించిన వీడియోని మా యూట్యూబ్ ఛానల్ అయినా AJ Media Network లో విడుదల చేయడం జరిగింది...
ఆసక్తి ఉన్నవారు... ఇంకా వివరంగా తెలుసుకోవాలి అనుకున్నవారు మా ఛానల్ని Subscribe చేసి చుడండి థాంక్యూ మిత్రమా
1..అల్చిప్పా అనే జీవి ఒకేసారి 20కోట్ల గుడ్ల వరకు పెట్టాగలదు కానీ వాటిలో పెరిగి పెద్దయ్యేవి మాత్రం వందలో మాత్రమే...
2..ప్రపంచంలో అతి ప్రమాదకరమైన రసాయనం పేరు " సైనైడ్ " అయితే ఇది మనం రోజు తినే ఆపిల్ గింజల్లో కూడా ఉంటుంది.. కానీ ఇది చాలా తక్కువ ఉండటం వల్లనా దీని ప్రభావం మన శరీరం మీద పనిచేయదు ఒక మనిషి " సైనైడ్ " వల్ల చనిపోవాలంటే అతనిలో kg కి 1mg సైనైడ్ అవసరం.. కానీ ఒక ఆపిల్ గింజల్లో 0.49 mg సైనైడ్ ఉంటుంది.. అంటే ఒక 50kg లు బరువు ఉన్న మనిషి ఒకేసారి 120 ఆపిల్ గింజలు తినడాంటే అతను చనిపోయ్యే అవకాశం ఉంది.. అందుకని ఆపిల్ తినడం మానేయకండి ఎందుకంటే ఒకటి..,రెండు.., ఆపిల్ గింజలు తినకూడా మనకి ఏమి కాదు.., అంతేకాక ప్రతిరోజు ఒక ఆపిల్ తింటే ఆరోగ్యనికి ఎంతో మంచిది...
3..చిమ్మలో పనిచేసే చీమలు కేవలం 3సంవత్సరాలు మాత్రమే బ్రతుకుతాయి.., కానీ అందులో రాణి చీమ అనే చీమ మాత్రం 30సంవత్సరాలు బ్రతుకుతుంది...
4..జిరాపి యొక్క నాలుక భాగం 21 అంగుళాలు ఉంటుంది.. దాని తోటే జిరాపి తన చెవులనీ శుభ్రం చేసుకుంటుంది...
5..జీబ్రా అనగానే ముందుగా మనకి గుర్తుకు వచ్చేది తన బ్లాక్ అండ్ వైట్ గీతలు కానీ జిబ్రా జాతులలోని ఏ రెండు జిబ్రా గీతాలు ఒకేలా ఉండవు...
6..యురాప్ కి చెందిన గోధుమరంగు కుందేలు ప్రసవానికి కొన్ని రోజుల ముందే రెండో గర్భానీ పొందగలవు.., అంటే ఒకేసారి రెండు గర్భలను ధరించగలవు...
7..కివి అనే పక్షులకి కళ్ళు కనబడవు.. అవి కేవలం వాసన తోనే పసిగట్టగలవు...
8..చీమలకు శుద్ధపొడి అంటే చక్ పిస్ అంటే పడదు.., అందుకే సుద్దముక్కతో గీసిన గీతలను అవి దాటలేవు...
9..ఇప్పటివరకు మనం అంతరిక్షంలోకి ఉపగ్రహాలను పంపడం చూసాం కానీ " ఎలాన్ మాస్క్ " అనే బిజినెస్ మ్యాన్ మాత్రం తన " స్పేస్ ఎక్స్ " అనే కంపెనీ రాకెట్ ద్వారా " tesla roads art " అనే కారునీ పంపించాడు.. ఇది ఫిబ్రవరి 6న rocket roads art అనే పేరుతో లాంచ్ అయింది.. దీనిలో " స్టార్ మ్యాన్ " అనే డ్రైవర్ నీ కూడా ఉంచారు అలాగే ఈ ప్రయోగంలో పాల్గొన్న 6,000 మంది పేర్లను ఆ కార్లో ప్రింట్ చేయించాడు.. మరో విషయం ఏమిటంటే ఆ కార్ సర్క్యూట్ మీద " మేడ్ ఆన్ ఎర్త్ బై హ్యూమన్స్ " అని కూడా ప్రింట్ చేశారు...
10..గొంగళిపురుగు సీతకొక చిలుకల మారడానికి ముందుగా తనలో విడుదల అయ్యే కొన్ని " ఎన్ జైమ్స్ " వల్ల తన శరీరం మొత్తం కరిగి ద్రవంలా మారుతుంది.., అందులోనుంచే కణవిభజన జరిగిన తర్వాతే గొంగళిపురుగు.., సీతకొకచిలుకాల మారడం జరుగుతుంది...
11..ఫోటోలో కనిపిస్తున్న పువ్వు పేరు " జీనీయా ".. కొన్ని ఇళ్లలో ఈ పువ్వునీ పెంచుకోవడం మీరు చూసే ఉంటారు.., అయితే దీనికి ఒక ప్రత్యేకత ఉంది.. అంతరిక్షంలో పెరిగిన మొట్టమొదటి పువ్వుగా దీనికి పేరు.. ఈ పువ్వునీ " ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ " లో మొక్కల పెరుగుదల వ్యవస్థలో భాగంగా దీని పెంచారు.. దీనినే " వెజిటబుల్ ప్రొడక్షన్ సిస్టమ్ " ( వేజ్జి ) అని కూడా పిలుస్తారు.. " ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ " అనే ఈ స్టేషన్ భూమికి 248 మైళ్లు అంటే సుమారు 400km ల ఎత్తులో ఉంది.. రెడ్.,గ్రీన్.,బ్లూ.,( RGB ) లైట్లతో కూడిన ఈ గదిలో ఈ మొక్క విత్తనాలను నాటి పెంచారు.. 2016 జనవరి 16న మొదటిసారిగా ఈ పువ్వు అంతరిక్షంలో వికసించింది.. అందుకే దీనిని స్పేస్ ఫ్లవర్ అని కూడా పిలుస్తారు...
12..ప్రపంచంలోనీ దాదాపు అన్ని దేశాల జెండాలు ఒకే ఆకారంలో ఉంటాయి కానీ కానీ మన దేశంపక్కన ఉండే నేపాల్ దేశం జెండా మాత్రం విటన్నిటికీ బిన్నంగా ఉంటుంది...
13..ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన చెట్టు " మంచినీల్ చెట్టు ".. మంచినీల్ అంటే స్పానీస్ భాషలో " లిటిల్ ఆపిల్ " అని అర్ధం.. ఇది చూడటానికి కొంచెం ఆపిల్ చెట్టులనే ఉంటుంది. ఈ చెట్టు కారిబీయాన్ తీరా ప్రాతంలా ఉత్తరా మరియు దక్షిణ అమెరికా తీరా ప్రాతాల వరకు ఉన్నాయి.. ఈ చెట్టులోని ప్రతి భాగం విషపూరితమే.. ఈ చెట్టు ఒక రకమైన విషపదార్ధాన్ని విడుదల చేస్తుంది.. ఈ చెట్టుని ముట్టుకున్న., ఈ చెట్టు పండున్ని తిన్న., దీని కాల్చినప్పుడు దగ్గరగా ఉన్న ప్రమాదమే... ఎందుకంటే ఈ చెట్టుని ముట్టుకుంటే చర్మంపై పొక్కులతో కూడిన అల్లెర్జి వస్తుంది.. ఈ అల్లెర్జి క్రమంగా మరణానికి దారి తీస్తుంది.. ఇక ఈ చెట్టు పండుని తింటే శరీరం మొత్తం నొప్పి మొదలై చివరికి అది కూడా మరణాన్నికి దారితీస్తుంది.. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే వర్షం పడినప్పుడు ఈ చెట్టు కింద ఉన్న ప్రమాదమే ఎందుకంటే చెట్టు నుండి పడే వర్షాపు బొట్లు వల్ల చర్మంపై అల్లెర్జి వస్తుంది.. అలాగే ఈ చెట్టు నుండి పాలు వస్తాయి.. ఈ పాల చుక్క ఒకటి కారు మీద పడిన చాలు ఆ బొట్టు పడిన చోట్టంతా కార్ పెయింట్ పోతుంది.. ముఖ్యంగా ఈ చెట్టుని కాల్చాలేము.. ఎందుకంటే ఈ చెట్టుని కాల్చడం ద్వారా విడుదల అయ్యే పొగ కళ్ళలోకి వెళ్తే వారు గుడ్డివారిగా మారిపోతారు.. అందుకే ఈ చెట్టుని " లిటిల్ ఆపిల్ అఫ్ డెత్ " అని అంటారు.. అలాగే ఇది తీరా ప్రాతాలో పెరుగుతుంది కాబ్బటి దీనిని " బీచ్ ఆపిల్ " అని కూడా అంటారు...
14..చిరిగిన జీన్స్ ఇప్పుడోక ఫ్యాషన్ దీనినే రిప్పిడ్ జీన్స్ లేదా టాన్ జీన్స్ అని అంటారు.. ఇలాంటి జీన్స్ మెషిన్ ద్వారా లేదా మనుషుల ద్వారా తయారుచేయడం జరుగుతుంది కానీ ఇవి మాత్రం జూ లో ఉండే జంతువులతో తయారుచేయిస్తారు.., జపాన్ లో ఉండే జూ జీన్స్ అనే సంస్థ.., జీన్స్ బట్టలని టైర్ లకి చెక్కలకి చుట్టి జూ లోని జంతువులకి ఇస్తారు.. ఆవి ఆడుకుంటున్నప్పుడు చిరిగిన ఆ పాంట్స్ కి ష్టిచస్ వేసి., వేలం వేసి అమ్ముతారు అలా వచ్చిన డబ్బుని జూ లకు విరాళంగా ఇస్తారు.. జూ లో చింపిన జంతువుల స్థాయిని బట్టి 1., 2., 3., క్యాటగిరిలుగా విభజిస్తారు.. సింహం గిరితే లయన్ 1., లయన్ 2., లయన్ 3., అని అలాగే పులి గిరితే టీ1., టీ2., టీ3., అలా అన్నామాట...
15..తాబేలలో " సీ టార్ట్టల్ " అనే జాతి తాబేల సంతానం యొక్క పుట్టభోయ్యే పిల్లలు అడ., మగ అని వాటి చుట్టూ ఉండే వాతావరణమే నిర్ణయిస్తుంది., గుడ్డుని పొద్ధిగినప్పుడు వాతావరణం వెచ్చగా ఉంటె అడ తాబేలగాను., చల్లగా ఉంటె మగ తాబేలగాను పుడతాయి...
16..మనుషులని., ఇతర జీవుల్ని అడదోమలు మాత్రమే కూడతాయి.. ఎందుకో తెలుసా..?! అవి గుడ్లను ఉత్పత్తి చేయడానికి కావలిసిన ప్రోటిన్ కోసం.., ఇంకా ఆ ప్రొటిన్ కేవలం మన రక్తంలో మాత్రమే ఉంటుంది... ఇంకా ఇవి రక్తాన్ని పీల్చుకున్నకా రెండు రోజులు విశ్రాంతి తీసుకుంటాయి.. ఆ సమయంలో వాటి యొక్క గుడ్లు అభివృద్ధి చెందుతాయి.. ఇక మగ దోమల విషయానికి వస్తే ఇవి చెట్ల ఆకులని కండాలని కుట్టి వాటి యొక్క రసాలని పీల్చుకొని బ్రతుకుతాయి...
17..హ్యరి పొట్టర్ చివరి బుక్ విడుదల అయినా 24 గంటల్లో కోటిన్నర పుస్తకాలకు పైగా అమ్ముడై రికార్డు సృష్టించింది.. ఈ సిరీస్ లోని అన్ని భాగాలూ ఇప్పటివరకు 50కోట్లకు పైగా అమ్ముడైపోయాయి...
18..షార్క్ అంటే సొరచాప.., తన జీవితకాలంలో పళ్ళు రాలడం.., ఆ తరువాత తిరిగి పుట్టడం జరుగుతుంది.., అలా తన జీవితకాలంలో సుమారుగా 30వేల దంతలు పుడతాయంట ఆలాగే షార్క్ శరీరంలో ఒక ఎముక కూడా ఉండదు...
19..ప్రపంచంలో రెండు దేశాలను కలిపే అతి చిన్న వంతెన పోర్టుగల్ మరియు స్పెయిన్ మధ్య ఉంది దీనినే ఎల్-మార్కో అని పిలుస్తారు.. ఈ వంతెన సుమారుగా 10.4 అడుగులు ఉంటుంది ఈ రెండు దేశాల మధ్య ఉండే ఆఫ్రిలాంగొ అనే నదిని దాటడానికి ఈ వంతెనని నిర్మించారు.. ఇది స్పెయిన్ లోని బడాజో., మరియు ప్రవీణ్స్ లోని లాకోడోసేరా., ఇటు పోర్టుగల్ లోని ఆరోన్చెస్ లని కలుపుతుంది.. ఈ వంతెనని చెక్కతో నిర్మించారు...
20..మనం అంతరిక్షంలో ఉన్నప్పుడు., ఏడ్చినప్పుడు వచ్చే కనిళ్ళు కిందకి రాలవు అవి లిక్విడ్ బాల్స్ లా స్టిక్ అయ్యి మొఖంమీదే ఉండిపోతాయి... దీనికి కారణం స్పేస్ లో గ్రావీటి లేకపోవడం వల్ల...
ఆర్టికల్ మీద మీ అభిప్రాయాన్ని " COMMENT " బాక్స్ రూపంలో మాతో పంచుకోండి... ఈ ఆర్టికల్ నచ్చితే " LIKE " చేయండి...
ఆలాగే ఇలాంటి మరిన్ని ఆసక్తి కరమైన ఆర్టికల్స్ కోసం ఈరోజే మమాల్ని " FOLLOW " అవ్వండి.. Thank You ఫ్రెండ్స్...
ఇంకో మంచి " ఆర్టికల్ " తో మీ ముందుకు వస్తాను అంత వరకు సెలవు bye...
0 కామెంట్లు