3 Persons Proved That Sucess Not Need Any Degree In Telugu

 విజయానికి చదువు అవసరం లేదని నిరూపించిన ముగ్గురు వ్యక్తులు

ఎడ్యుకేషన్ అంటే చదువు చదువు అంటే పుస్తకాలలోని విషయాలతో మెదడుని నమ్మడం కాదు.. కొత్త ఆలోచనలని జ్యోతుల వెలిగించడం అని చెప్పారు W.B. yetes.. జీవితంలో గెలవలన్న తపన ఉంటెచాలని క్లాస్ రూమ్ నుంచి బయటకి వచ్చి ఈవాళ్ల లక్షలు సంపాదిస్తున్న వ్యక్తులు ఎందరో.., చదువున్ని నమ్ముకోకుండా కేవలం తమ కలలని., తమని మాత్రమే నమ్మి తమ కలలపై బ్రతికి.., వాటిని నిజం చేశారు మరికొందరు.. విజయాలకి.., చదువులకి ఎటువంటి సంబంధం లేదని నిరూపించిన వ్యక్తుల గురించే ఈ ఆర్టికల్... కాబ్బటి ఎవరైతే జీవితంలో గెలవలని తపన పడుతున్నరో వారందరు ఈ ఆర్టికల్ని మిస్ అవ్వకండి..

ఈ ఆర్టికల్ కి సంబందించిన వీడియోని మా యూట్యూబ్ ఛానల్ అయినా AJ Media Network లో విడుదల చేయడం జరిగింది... 

https://youtu.be/Siq0fM0FXig

ఆసక్తి ఉన్నవారు... ఇంకా వివరంగా తెలుసుకోవాలి అనుకున్నవారు మా ఛానల్ని Subscribe చేసి చుడండి థాంక్యూ మిత్రమా... 


3.. మైఖేల్ డెల్

మైఖేల్ డెల్ అలియాస్ డెల్... డెల్ కి చిన్నప్పటి నుంచే కంప్యూటర్ మీద ఆసక్తి ఎక్కువ.. తన ఏడేళ్ళ వయసులో ఒక కాల్కులేటర్ కొని అది ఎలా పనిచేస్తుందో తెలుసుకున్నాడు.. అలాగే తన 12 ఏళ్ల వయసులో ఆపిల్ 2 కంప్యూటర్ అప్పుడే రిలీజ్ అయింది.. డెల్ ఆ కంప్యూటర్ కూడా కొని అది ఎలా పనిచేస్తుందో తెలుసుకున్నాడు.. ఆలా కంప్యూటర్ మీద ఉన్న ఆసక్తి ఉన్నప్పటికీ తన అమ్మానాన్నలా కోరిన విధంగా డాక్టర్ చదవడం కోసం యూనివర్సిటీ అఫ్ టెక్సస్ లో ఫ్రీ-మేడ్ స్టూడెంట్ గా అందులో చేరాడు.. కానీ డెల్ కీ చదువు మీద కన్నా కంప్యూటర్ టెక్నాలజీ మరియు బిజినెస్ మీద ఆసక్తి ఎక్కువ.. ఆలా తను చదువుకుంటున్న టైం లోనే పార్ట్ టైం జాబ్ గా కంప్యూటర్ పార్ట్స్ న్ని అమ్మడం మొదలుపెట్టాడు.. కొద్దీకొద్దిగా డెల్ వ్యాపారం లాభాలోకి చేరింది.. అదే సంవత్సరంలో డెల్ బిజినెస్ 2 లక్షల డాలర్ లాభాన్ని పొందింది.. ఇక అప్పుడే డెల్.., బిజినెస్ మీద తనకున్న ఆసక్తిని వదులుకోలేక తను చదువుతున్న డాక్టర్ చదువుని రెండో సంవత్సరంలోనే అప్పేసి 1984 లో అతని సొంత కంపెనీ అయినా డెల్ ను ప్రారంబించాడు.. ఆ తరువాత డెల్ వెనక్కి తిరిగిచూసుకోలేదు... ఈరోజు డెల్ యొక్క సంవత్సర ఆదాయం 30.6 బిల్లీయాన్ డాలర్లు అంటే మన ఇండియా కరెన్సీ లో 21, 83, 46, 30, 00, 000 అంటే దాదాపు 21 లక్షల కోట్లు...

2..జాన్ కోమ్


జాన్ కోమ్ 2011 వరకు ఈ పేరు ఎవరికీ తెలీదు మనం ఇప్పుడు వాడుకుంటూన్న ఒక అప్ ని ఫిబ్రవరి -24-2009 న వాట్సాప్ కంపెనీ గా స్టార్ట్ చేశారు ఈరోజు ఆ అప్ ని 1 బిల్లీయాన్ యూసర్స్ ఉపయోగిస్తున్నారు.. జాన్ కామ్.. సాన్ జోస్ స్టేట్ యూనివర్సిటీ లో తను చదువుకునేటప్పుడు యాహు కంపెనీలో సెక్యూరిటీ టేస్టర్ గా పనిచేసేవారు... అయితే కొన్ని కారణాల వల్ల జాన్ కామ్ తన చదువుని మధ్యలోనే అప్పేయల్సి వచ్చింది... తరువాత జాన్ కంప్యూటర్ నెటవర్క్కింగ్ మీద తనకున్న ఆసక్తి మరియు కనౌలెడ్జి తో ఏదైనా ఒక అప్ ని డెవలప్ చేదాం అని అనుకున్నారు... ఇంకా ఆ ఆలోచనే ఈరోజు అతన్ని ప్రపంచ మొత్తానికి తెలిసేలా చేసింది... 2009లో తను క్రీయేట్ చేసిన వాట్సాప్ అనే ఒక అప్ అతి తక్కువ టైంలోనే చాలా మంది యూసర్స్ ని సొంతం చేసుకుంది... ఈరోజు ప్రతి స్మార్ట్ ఫోన్ లోను వాట్సాప్ అప్లికేషన్ ఉండాల్సిందే... ఒక్కపుడు చదువు మానేశావ్ అని తనని తిట్టినా వాళ్లే ఈరోజు అతని గురించి గొప్పగా మాట్లాడుకుంటూన్నారు.. ఒక్కప్పుడు చేతిలో ఒక్క డాలర్ కూడా కానీ ఇప్పుడు జాన్ కామ్ ఆదాయం ఏకంగా 10.1 బిల్లీయాన్ డాలర్లు... మన ఇండియా కరెన్సీలో చెప్పలంటే 7,20,68,55,00,000 కోట్లు...

1...మార్క్ జుక్కర్ బార్గ్


మార్క్ జుక్కర్ బార్గ్.. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఈ పేరు తెలియని వాళ్లే ఉండరు... ఇతను క్రీయేట్ చేసిన ఫేస్బుక్ అనే వెబ్సైట్ అతను ఏంటో ఈ ప్రపంచానికి తెలిసేలా చేసింది... మార్క్ జుక్కర్ బార్గ్ కీ చిన్నప్పటి నుండే కంప్యూటర్ ప్రోగ్రామ్స్ మీద ఆసక్తి ఎక్కువ.. ఆలా తనకున్న ఆసక్తి తో ఎన్నో కంప్యూటర్ ప్రోగ్రామ్ లాంగ్వేజ్స్ ని నేర్చుకోని మెసెంజర్ లాంటి ఎన్నో ప్రోగ్రామ్స్ ని డిజైన్ చేసి వాటిని డెవలప్ చేశారు...



మార్క్ జుక్కర్ బార్గ్... హర్వర్డ్ యూనివర్సిటీలో తను చదువుకుంటున్న టైం లో పేస్ మాష్ అనే ఒక వెబ్సైట్ ని స్టార్ట్ చేశారు.. అందులో అందమైన అమ్మాయిలా ఫోటోలని అప్లోడ్ చేసి వాటికీ ర్యాంక్కింగ్ ఇవ్వమనేవాడు... చాలా కొద్దీ టైంలోనే ఈ వెబ్సైట్ చాలా ఫేమస్ అయింది.. కానీ తను అప్లోడ్ చేసిన అమ్మాయిలా ఫొటోస్ ని ఆ అమ్మాయిలని అడగకుండా అప్లోడ్ చేయడం తప్పు కాబ్బటి ఆ అమ్మాయిలు ఆ కాలేజీ ప్రిన్సిపాల్ కీ కంప్లైంట్ చేశారు... ఇక జుక్కర్ బార్గ్ తన తప్పు తెలుసుకొని తన పేస్ మాష్ వెబ్సైట్ ని క్లోజ్ చేశారు... కానీ ఆ తరువాత కొన్ని రోజులకి తను చేసిన ఆ తప్పు నుంచే తన జీవితాన్ని మార్చే ఐడియా తనకి వచ్చింది.. అది..., తన కాలేజీ స్టూడెంట్స్ అందరు తమ ఒపీనియన్స్ ని.., ఫీలింగ్స్ ని షేర్ చేసుకునే ఒక వెబ్సైటు ని క్రియేట్ చేయాలనుకున్నారు.. ఆ టైం లోనే తన ఫ్రెండ్స్ అందరూ పార్టీలకి.., పబ్ లకి వెళ్తుంటే తను మాత్రం తనకి వచ్చిన ఐడియా మీద పనిచేసేవారు... చివరికి తను అనుకున్నది సాధించారు... తనకి వచ్చిన ఐడియాన్ని ఫేస్బుక్ అనే ఒక వెబ్సైటు గా స్టార్ట్ చేశారు.. అతి తక్కువ టైం లోనే ఫేస్బుక్ న్ని తన కాలేజీ స్టూడెంట్స్ మాత్రమే కాకుండా ప్రపంచం మొత్తం వాడడం మొదలుపెట్టారు.. అతి తక్కువ టైం లోనే ఫేస్బుక్ చాలా ఫేమస్ అయింది.. మార్క్ జుక్కర్ బార్గ్  తను సృష్టించిన ఫేస్బుక్ కోసం తన చదువుని మధ్యలోనే అప్పేసారు.. ఆలా తను తయారుచేసిన ఫేస్బుక్.., ప్రపంచమొత్తం ఆదరణ పొందడంతో మార్క్ జుక్కర్ బార్గ్ అతి తక్కువ టైం లోనే ప్రపంచ ధనవంతులలో ఒకడిగా చేరిపోయాడు.. ఈరోజు మార్క్ జుక్కర్ బార్గ్ ఆదాయం 69.4 బిల్లీయాన్ డాలర్లు... మన ఇండియా కరెన్సీ లో చెప్పాలంటే 49,52,03,70,00,000 కొట్లు



ఒక వ్యక్తి విజయం తను చదువుకున్న చదువులో ఉండదు.. అతనికి వచ్చిన ఐడియాలో ఉంటుంది.. అది ఈ ముగ్గురి విషయంలో నిరూపించబడింది.. ఈ ముగ్గురు తమ కొచ్చిన ఐడియా లనే తమ కెరీర్ గా ఎంచుకున్నారు.., తమ జీవితంగా మార్చుకున్నారు.., అందుకోసం తమ చదువులని సైతం మధ్యలోనే అప్పెసారు.. ఈరోజు ఈ ముగ్గురికి వచ్చిన ఐడియాలనే ఈ ప్రపంచానికి ఉపయోగపడుతున్నాయి... మీకు ఎందులో ఆసక్తి ఉందొ దానినే మీ కెరీర్ గా ఎంచుకోండి.. కష్టపడండి.. తప్పకుండ మీ జీవితంలో సక్సెస్ అవుతారు..



ఈ ఆర్టికల్ మీద మీ అభిప్రాయాన్ని " COMMENT " బాక్స్ రూపంలో మాతో పంచుకోండి... ఈ ఆర్టికల్ నచ్చితే " LIKE " చేయండి...

ఆలాగే ఇలాంటి మరిన్ని ఆసక్తి కరమైన ఆర్టికల్స్ కోసం ఈరోజే మమాల్ని " FOLLOW " అవ్వండి.. Thank You ఫ్రెండ్స్... 

ఇంకో మంచి " ఆర్టికల్ " తో మీ ముందుకు వస్తాను అంత వరకు సెలవు bye...

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు